29, డిసెంబర్ 2013, ఆదివారం

26, డిసెంబర్ 2013, గురువారం

గుర్తుకొస్తున్నాయి-11

రవీవంశీవాళ్లతో కలిసి ఆడిన పోటీ క్రికెట్ మ్యాచ్
మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ గా నిలిచిన నాకు కొనిచ్చిన ఐసుక్రీం
స్కూల్ కబడ్డీ పోటీల్లో నాకిచ్చిన రన్నరప్ సర్టిఫికెట్
ఎప్పుడూ ఇష్టంగా ఆడే షటిల్ బ్యాడ్మింటన్
నాకు గుర్తుకొస్తున్నాయి..
ఆడుకునేందుకు వెళ్తున్నామని నా పిల్లలు చెప్పినప్పుడల్లా..


\26.12.13\

మంచిమాట

SAKSHI Family 26.12.13

తెలిసిందిలే

తెలిసిందిలే_నీలోని చురుకెంతో తెలిసిందిలే ..@
శర్మ

\26.12.13\

25, డిసెంబర్ 2013, బుధవారం

గుర్తుకొస్తున్నాయి-10

సువర్ణమ్మ టీచరుగారికిచ్చిన డిసెంబరుపూలు
రత్నకుమారుకి ప్రత్యేకంగా చేసిచ్చిన గ్రీటింగుకార్డు
క్రిస్మస్ రాత్రి ఫ్రెండ్సుతో కలిసి చర్చికెళ్లిన రోజులు
మా స్టాఫందరికీ స్వర్ణలత పెట్టిన కేకుముక్కలు
నాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి..
క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడల్లా..


\25.12.13\

MERRY CRISMAS


యూ ఆర్ మై లక్కీస్టార్

ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్_
యూ ఆర్ మై లక్కీస్టార్ ..@శర్మ

\25.12.13\

24, డిసెంబర్ 2013, మంగళవారం

గుర్తుకొస్తున్నాయి-9

బిషప్ స్కూల్లో నా చెల్లెళ్లకు తీసుకెళ్లిన క్యారేజీలుమాంటిస్సోరీ కాలేజీలో వాళ్లను చేర్పించిన రోజులుఇంట్లో అంతా కలిసి ఆడుకున్న అష్టాచెమ్మాఅప్పుడప్పుడు పోట్లాడుకోడ్డాలు.. అలకలునాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి..నా చెల్లెళ్లు ఇంటికొచ్చినప్పుడల్లా..


\24.12.13\

కలసిన మనసుల సవ్వడి

కలసిన మనసుల సవ్వడి_కలవనున్న జీవితాల ముడి ..@శర్మ

\24.12.13\

23, డిసెంబర్ 2013, సోమవారం

గుర్తుకొస్తున్నాయి-8

డిగ్రీ సర్టిఫికెట్టుకోసం నేను పడిన ఆరాటం
దుర్గాప్రసాదుతో కలిసి రైల్లో ప్రయాణం
యూనివర్సిటీ క్యాంటీన్లో తిన్న భోజనం
ఇందిరాగాంధీ మృతితో రద్దయిన కాన్వొకేషన్
నాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి..
నాగార్జున యూనివర్సిటీ పేరు విన్నప్పుడల్లా..

\23.12.13\

నీ పిలుపుకోసమే

నా ఎదురుచూపులన్నీ నీ పిలుపుకోసమే..@శర్మ

\23.12.13\

22, డిసెంబర్ 2013, ఆదివారం

21, డిసెంబర్ 2013, శనివారం

గుర్తుకొస్తున్నాయి-7

హిందీలో క్లాసు ఫస్టొచ్చినప్పుడు అందుకున్న బహుమతిఆసియాక్రీడలప్పుడు సెలవులివ్వాలని మేం చేసిన అల్లరిక్రిస్మస్ పండక్కి ఫాదర్స్ క్వార్టర్సులో చేసిన డెకరేషన్అర్ధరూపాయితో క్యాంటీన్లో కొనుక్కున్న ఆనియన్ దోశనాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి..క్రిస్మస్ సందడి మొదలైనప్పుడల్లా..


\21.12.13\|

బావొస్తున్నాడు

బేలచూపులేల బాల_బావొస్తున్నాడుగా ఈవేళ ..@శర్మ

\21.12.13\

20, డిసెంబర్ 2013, శుక్రవారం

గుర్తుకొస్తున్నాయి-6

కిక్కిరిసిన ఐదోనంబరు సిటీబస్సులో వేలాడ్డాలుచలం రమేషులతో గ్రౌండంతా తిరిగిన రోజులురెండోసారి అందుకున్నమెరిట్ స్కాలర్షిప్ మూడొందలుతరచు రద్దయ్యే వైఎల్పీ మాస్టారి హిందీక్లాసులునాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి..లయోల కాలేజీ పక్కగా రోజూ ఆఫీసుకెళ్తున్నప్పుడు..


\20.12.13\

ప్రేమ ఇష్క్ కాదల్

ప్రేమ ఇష్క్ కాదల్_భాష ఏదైనా భావమొక్కటే ..@శర్మ

\20.12.13\

19, డిసెంబర్ 2013, గురువారం

గుర్తుకొస్తున్నాయి-5

చందూవాళ్ల మేడమీద చేసిన కంబైన్డ్ స్టడీలుఅర్ధరాత్రి కొత్తొంతెన సెంటరుకెళ్లి తాగిన గరమ్ చాయ్సుదర్శనరావు మాస్టారు రాయించిన ఇంపోజీషన్లుఫేర్వెల్ రోజున అమ్మాయిల్తో కలిసి చూసిన ప్రేమాభిషేకం సిన్మానాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి..ఎవరన్నా శారదాకాలేజీలో చదువుతున్నానని చెప్పినప్పుడు..


\19.12.13\

గోరంత కొండంత

భలే చేశావే_గోరంతను కొండంత ..@శర్మ

\19.12.13\

అమ్మాయే కావాలి

మిత్రులందరికీ శుభోదయం..

ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో ప్రత్యేక బహుమతి పొందిన నా కథ ప్రచురితమైంది.. చదివి మీ అభిప్రాయం చెప్పండి..
ధన్యవాదాలు
19-12-13

18, డిసెంబర్ 2013, బుధవారం

గుర్తుకొస్తున్నాయి-4

ఇంట్లో గోడలపై అతికించిన హీరోకృష్ణ బొమ్మలు
అల్లూరిసీతారామరాజు టిక్కెట్లకోసం నేను పడిన ఇక్కట్లు
శాంతీథియేటర్లో ఘరానాదొంగ సినిమాకు గీసిపెట్టిన చార్టులు
ఊరికిమొనగాడు తొలిరోజు మార్నింగ్ షోలో వేసిన ఈలలు
నాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి..
నటశేఖరుడి సినిమా టీవీలో వస్తున్నప్పుడు..


\18.12.13\

ఫేసుబుక్కులో ఫేక్ లుక్

SAKSHI Family 18-12-13

ముసుగుచాటు అందం

ముసుగుచాటు అందం_చూస్తూరాసేస్తా ప్రబంధం ..@శర్మ

\18.12.13\

17, డిసెంబర్ 2013, మంగళవారం

గుర్తుకొస్తున్నాయి-3

వెంకటేశ్వర్లు కుట్టిచ్చిన బెల్బాటమ్ ఫ్యాంటుతొలిసారి సెలూనుకెళ్లి చేయించుకున్న  హిప్పీక్రాఫుపొడుగ్గా కనిపించాలని కొనుక్కున్న హైహీల్ బూట్లుబస్సులో నాన్నగారు పోగొట్టుకున్న నా ఫీజు డబ్బునాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి..ఏదైనా కాలేజీముందుగా వెళుతున్నప్పుడు..


\17.12.13\

ఎంతసేపు నీ మౌనం

ఎంతసేపు నీ మౌనం_వినిపించవా వేణుగానం ..@శర్మ

\17.12.13\

16, డిసెంబర్ 2013, సోమవారం

పాదదాసులు

పాదదాసులెందుకవుతారో ఇపుడే తెలిసింది ప్రియా ..@శర్మ

\16.12.13\

గుర్తుకొస్తున్నాయి-2

పుస్తకంలో దాచుకున్న సరస్వతీఆకు
బాలయ్య బండివద్ద కొనుక్కున్న పుల్లయిసు
హిందీటీచర్ వేళ్లుతిప్పికొట్టిన స్కేలుదెబ్బలు
బడిగంట కొట్టాలని నేను పడిన ఆరాటం
నాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి..
ఏదైనా స్కూలు కనిపించినప్పుడు..

\16.12.13\

15, డిసెంబర్ 2013, ఆదివారం

గుర్తుకొస్తున్నాయి-1

బామ్మ వండిన ఆవిరికుడుంఅమ్మ కలిప్పెట్టిన సున్నీఆవకాయన్నంపండక్కి నాన్నగారు కొన్న బద్దీలనిక్కరుమావీధిలో పిల్లల్తో ఆడిన కర్రల క్రికెట్టునాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి..బాల్యాన్ని తలుచుకున్నప్పుడల్లా..


\15.12.13\

14, డిసెంబర్ 2013, శనివారం

13, డిసెంబర్ 2013, శుక్రవారం

కిర్రాకు

పరాకుగా ఉన్నా కిర్రాకు పుట్టిస్తున్నావుగా ..@శర్మ

\13.12.13\

12, డిసెంబర్ 2013, గురువారం

బులాకిబాల

ఓహో
బులాకిబాల_ఎంత చలాకీగా ఉన్నావే ఈవేళ ..@శర్మ

\12.12.13\

11, డిసెంబర్ 2013, బుధవారం

తేనెకన్నులవి

తేనెకన్నులవి..పాలబుగ్గలవి_పిల్లతెమ్మెరలా తాకిపోయితివి ..@శర్మ

\11.12.13\

భలే మంచిరోజు

మళ్లీ మనం చూడలేని భలే మంచిరోజు

భలే మంచిరోజు

మళ్లీ మనం చూడలేని భలే మంచిరోజు

10, డిసెంబర్ 2013, మంగళవారం

9, డిసెంబర్ 2013, సోమవారం

8, డిసెంబర్ 2013, ఆదివారం

నేడు సుబ్రహ్మణ్య షష్ఠి

నేడు సుబ్రహ్మణ్య షష్ఠి (8.12.13)

ఆనందోధర్మ

||ఆనందోధర్మ||

ప్రేక్షకులను నవ్వించిన
ఆయనొక ఆనందోబ్రహ్మ..
వెండితెరపై ఇక కనిపించదు
ధర్మవరపు బొమ్మ

నైనైట్ ఫోరైట్ అంటే
థియేటర్లలోచప్పట్లు..
ఎప్పటికీ గుర్తుంటాయి
డింగ్ డాంగ్ ముచ్చట్లు

(7.12.13న కన్నుమూసిన హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి నివాళి)

నా మల్లి కనిపించడంలేదు

నా మల్లి కనిపించడంలేదు_మల్లెపూల జాతరలో ..@శర్మ

\8.12.13\

7, డిసెంబర్ 2013, శనివారం

పున్నమిరేయి

నా మదిగది నిండిపోయింది
పున్నమిరేయి మధురిమలతో ..@శర్మ

\7.12.13\

6, డిసెంబర్ 2013, శుక్రవారం

చంపసరాలు

శుభోదయం

నాలో కొత్తస్వరాలు పలికిస్తున్నాయి నీ చంపసరాలు ..@శర్మ

\6.12.13\

మహానటి సావిత్రి

నటనలో మేటి
ఎవరూ రారు సాటి
అందుకే ఆమె మహానటి

(నేడు సావిత్రి జయంతి)

\6.12.13\

5, డిసెంబర్ 2013, గురువారం

గురువారం నాది


ఆదివారం..

నాకిష్టంలేని రోజు
అందరికీ సెలవైతే
నాకు ఆఫీసుంటుంది

సోమవారం..

సోమరివారం
కాస్త కష్టపడాల్సిందే
పిల్లల్ని నిద్రలేపడానికి

మంగళవారం..

అమంగళం కాకున్నా
ఏదో ఒకసాకుతో
పనులన్నింటికీ బ్రేకులే

బుధవారం..

త్వరగా గడవాలనుకుంటా
ఎందుకో తెలుసా
మర్నాడు గురువారం కదా

గురువారం..

భలే మంచిరోజు
నాకు వీక్లీఆఫ్
ఎంచక్కా ఇంట్లో గడపొచ్చు

శుక్రవారం..

ఇదీనూ ఇష్టమే
లలితాసహస్రనామాలతో
మా ఇల్లు మార్మోగుతుంది

శనివారం..

విశ్రాంతిలేని పనివారం
నా శ్రీమతి వండే వెరైటీ టిఫిన్లు
ఆఫీసులో వారాంతపు సమీక్షలతో#

\5.12.13\

4, డిసెంబర్ 2013, బుధవారం

మొగుడూ పెళ్లాల దొంగాట కథ

మిత్రులారా..

చెన్నయ్ నుంచి వెలువడే స్వప్న మాసపత్రిక డిసెంబరు సంచికలో నేను రాసిన మొగుడూ పెళ్లాల దొంగాట కథ ప్రచురితమైంది. వీలుంటే చదివి మీ అభిప్రాయం చెప్పండి..


3, డిసెంబర్ 2013, మంగళవారం

మెడమంత్రపుసిరి

మెడమంత్రపుసిరి_మెరిసిపోతున్నావ్ ప్యారీ ..@శర్మ

\3.12.13\

2, డిసెంబర్ 2013, సోమవారం

మల్లెలవాన

తడిసి గుబాళిస్తున్నా_నువు కురిపించిన మల్లెలవానలో ..@శర్మ

\2.12.13\

1, డిసెంబర్ 2013, ఆదివారం

బంగారుబల్లి

నీ చెవినిల్లు కట్టుకుంటా_బంగారుబల్లిలా ..@శర్మ

\1.12.13\