30, మార్చి 2014, ఆదివారం

29, మార్చి 2014, శనివారం

28, మార్చి 2014, శుక్రవారం

శీతలసమీరం

శీతలసమీరాన్నై నినుతాకుతా_నను తలుచుకున్నప్పుడల్లా  ..@శర్మ

\28.3.14\

27, మార్చి 2014, గురువారం

26, మార్చి 2014, బుధవారం

ప్రేమతాళంచెవి

నా గుండెలాకర్ నిండా నువ్వే_ప్రేమతాళంచెవితో తెరిచిచూడు ..@శర్మ

\26.3.14\

25, మార్చి 2014, మంగళవారం

24, మార్చి 2014, సోమవారం

23, మార్చి 2014, ఆదివారం

కన్నులు కలువలు

కన్నులు కలువలైనట్లున్నాయ్_నాకోసం చూసిచూసి ..@శర్మ

\23.3.14\

22, మార్చి 2014, శనివారం

మా ప్రేమ

నేలను తాకిన ఓ మామ_కంటున్నావా
మా ప్రేమ ..@శర్మ

\22.3.14\

21, మార్చి 2014, శుక్రవారం

నీ ముఖబింబమే

అద్దమైనా..జల్లెడైనా కనిపించేది
నీ ముఖబింబమే ..@శర్మ

\21.3.14\

20, మార్చి 2014, గురువారం

పాలసోయగం

పాలసోయగం గుబాళిస్తోంది_పూల పరిమళంతో ..@శర్మ

\20.3.14\

19, మార్చి 2014, బుధవారం

ఎన్నికల ప్రస్థానం-8

మున్సిపాల్టీల్లో ముగిసింది
నామినేషన్ల ఉపసంహరణ..
నువ్వానేనా అంటుంటిరి
ప్రచార సమరాంగణాన..

ఆశపడి సీటురాని
అభ్యర్థులు అంతటా..
ఎగరేస్తారేమో అంటున్నారు
తిరుగుబాటు బావుటా..

\19.3.14\

నా మదినిండా నీరూపమే

నా మదినిండా నీరూపమే_ప్రేమతో తట్టిచూడు ..@శర్మ

\19.3.14\

18, మార్చి 2014, మంగళవారం

ఎన్నికల ప్రస్థానం-7

అన్ని పార్టీల గుండెల్లో
మోగిస్తున్నారు రె`బెల్స్`..
ప్రచారం చేస్తున్నారు
యథేచ్ఛగా గోబెల్స్..

నామినేషన్ల ఉపసంహ`రణం`లో
మునిగినారు నేతలు..
అలకలు తీర్చకుంటే
ఓటుబ్యాంకుకు కోతలు..

\18.3.14\

చిలక రాయబారం

అలక వీడవా సఖీ_చిలక రాయబారం పంపాగా ..@శర్మ

\18.3.14\

17, మార్చి 2014, సోమవారం

16, మార్చి 2014, ఆదివారం

ఎన్నికల ప్రస్థానం-6

ఘనచరితగల పార్టీకి
అభ్యర్థులు కరువు..
పోటీ చేయబోమంటూ
తీస్తున్నారు పరుగు..

ఓడలు బళ్లవడమంటె
ఇదేనోయి భాయి..
జనం నాడి తెలుసుకుని
మసలుకుంటే హాయి..


\16.3.14\

ప్రేమ

ప్రేమ పిచ్చిదే కాదు_పచ్చనిది కూడా ..@శర్మ

\16.3.14\

15, మార్చి 2014, శనివారం

ఎన్నికల ప్రస్థానం-5

పుట్టగొడుగుల్లా వస్తున్నాయ్కొత్త కొత్త పార్టీలు..పడక తప్పవేమోలేఎన్నికల్లో పల్టీలు..


పార్టీ అంటె కాదు మరి
అంగట్లో దొరికే కర్రీ..
హడావుడెంత చేసినా
చివరికి మిగిలేది వర్రీ..


\15.3.14\

కొరుక్కుతినాలనుంది

కొరుక్కుతినాలనుంది_నిన్నలా చూస్తుంటే ..@శర్మ


\15.3.14\

14, మార్చి 2014, శుక్రవారం

ఎన్నికల ప్రస్థానం-4

కార్పొరేషన్ నామినేషన్లకు
ముగిసెనండీ గడువు..
తిరుగుబాటు వీరులతో
తప్పదండీ తగవు..

ఇప్పటికే వాళ్లతోటి
మొదలాయెను సంప్రదింపులు..
తాయిలాల ఎరచూపి
చేయాలిక బుజ్జగింపులు..


\14.3.14\

ప్రేమలేఖలు

ఎన్నాళ్లీ
ప్రేమలేఖలు_ఇక రాసేద్దాం శుభలేఖలు ..@శర్మ

\14.3.14\

13, మార్చి 2014, గురువారం

ఎన్నికల ప్రస్థానం-3

ఇంకా పూర్తవలేదటఆంధ్రప్రదేశ్ విభజన..ఎంతకాలం చేస్తారిలాసమైఖ్యాంధ్ర భజన..


పదేపదే పెట్టకండిజనం చెవిలో పూలు..చేతనైతే చేయండిసీమాంధ్రకు మేలు..


\13.3.14\

చిలిపి జ్ఞాపకం

చిలిపిఊసుల జ్ఞాపకం_పెదవిపై నవ్వులసంతకం ..@శర్మ

\13.3.14\

12, మార్చి 2014, బుధవారం

ఎన్నికల ప్రస్థానం-2

పీసీసీలనూ చేసినారు
రెండుగా ముక్కలు..
కాంగ్రెసోళ్లకు ఉంటాయిలే
ఏవో కొన్ని లెక్కలు..


సత్తిబాబుకు ఝలకిచ్చి
రఘువీరాకు చాన్సు..
తెలంగాణకు పొన్నాలతో
అవుతుందా బ్యాలెన్సు..


\12.3.14\

నువు నవ్వితే వెన్నెలే

నువు నవ్వితే వెన్నెలే_సిగ్గుతో జాబిలమ్మ జారిపోతోంది ..@శర్మ

\12.3.14\

11, మార్చి 2014, మంగళవారం

ఎన్నికల ప్రస్థానం-1

మున్సిపల్ సమరానికి
చుట్టినారు శ్రీకారం..
ఎన్నికల చిత్రానికి
వచ్చిందొక ఆకారం..


ఆశావహుల ఎదురుచూపులు
వేసేందుకు నామినేషన్..
టికెట్ రాని నేతలంతా
అవుతుంటిరి పరేషన్..


\11.3.14\

అను`రాగాలే`

హృదయవీణను మీటితే పలికేవి
అను`రాగాలే` ..@శర్మ

\11.3.14\

10, మార్చి 2014, సోమవారం

ప్రేమసేద్యం

ప్రేమసేద్యం చేస్తున్నా_నీ కలలపంట పండిద్దామని ..@శర్మ

9, మార్చి 2014, ఆదివారం

భళా నీ రాజసం

బంతులపై భళా నీ రాజసం_నువు తాకిన పూలకు పరవశం ..@శర్మ

\9.3.14\

8, మార్చి 2014, శనివారం

7, మార్చి 2014, శుక్రవారం

6, మార్చి 2014, గురువారం

కల్లోకొస్తా

నిదురోతుంటే కల్లోకొస్తా_కనులుతెరిస్తే నీముందుంటా ..@శర్మ

\6.3.14\

5, మార్చి 2014, బుధవారం

అక్షరాలు సిగ్గిల్లుతున్నాయి

అక్షరాలు సిగ్గిల్లుతున్నాయి_మధురోహల్ని కలం విదిలిస్తుంటే ..@శర్మ

\5.3.14\

4, మార్చి 2014, మంగళవారం

3, మార్చి 2014, సోమవారం

2, మార్చి 2014, ఆదివారం