14, ఫిబ్రవరి 2015, శనివారం

ప్రేమా జిందాబాద్!

ప్రేమ..
రెండక్షరాల మధుర భావన
రెండు హృదయాల స్పందన..
ఇద్దరూ కలిసిమెలిసి తిరగక్కర్లేదు
కానుకలూ ఇచ్చిపుచ్చుకోనక్కర్లేదు..
మనసున మనసై మసులుకుంటే మేలు

కష్టాల్నిసుఖాల్ని పంచుకుంటే చాలు
ప్రేమికులు కావాలి నిత్య నేస్తాలు
పెళ్లితో చేరాలి బతుకు గమ్యాలు..

15, జనవరి 2015, గురువారం

సంబరాల సంక్రాంతి

రైతుల ఇంటికి చేరాలి ధాన్యంబళ్లు
ఇంటింటా పొంగాలి పాల పొంగళ్లు
చిన్నారులకు పోయాలి భోగిపళ్లు
ముగ్గులతో కళకళలాడాలి లోగిళ్లు
అత్తారింటికి దారిపట్టే అల్లుళ్లు
చిలిపి సరసాలాడే బావామరదళ్లు
పౌరుషాన్ని చూపే పందెంకోళ్లు
సంబరాలు తొక్కాలి కొత్త పరవళ్లు

1, జనవరి 2015, గురువారం

HAPPY NEW YEAR


ఆనంద వత్సరం

పాత సంవత్సరం పరిగెత్తిందిహైవేపై వేగంగా వెళుతున్న వాహనంలా..జీవనయానం సాగుతోందిగజిబిజి గందరగోళం ట్రాఫిక్ లా..
కష్టాలూ సమస్యలు కలిసొస్తాయిఅడుగడుక్కీ అడ్డుపడే స్పీడ్ బ్రేకర్లులా..తప్పు చేయొద్దని హెచ్చరిస్తాయిఎదురుగా కనిపించే ఎర్ర సిగ్నళ్ళు..మంచి పనులు చేసేందుకు అడ్డేముందిఇక ఆకుపచ్చ లైటు వెలిగాక..నూత్న వత్సరంలో జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకోఫ్లైఓవర్లా ఉన్నతిని అందుకో..