17, సెప్టెంబర్ 2013, మంగళవారం

హృదయవీణ

నవరాగాలు పలికించనా.. నీ హృదయవీణను మీటి..@శర్మ

\17.9.13\

16, సెప్టెంబర్ 2013, సోమవారం

అంతలా నవ్వకు..

అంతలా నవ్వకు.. నీ బుగ్గల సొట్టలు తీయలేను ..@శర్మ

\16.9.13\

మనమ్మాయికి `మిస్ అమెరికా` కిరీటం

న్యూయార్క్లో ఉంటున్న బెజవాడకు చెందిన నీనా దావులూరి `మిస్ అమెరికా-2014`గా ఎంపికైంది.. భారతీయ నృత్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి ఈ ఘనత సాధించిన నీనాకు శుభాభినందనలు...


15, సెప్టెంబర్ 2013, ఆదివారం

ఈ తలంబ్రాల సాక్షిగా..

ఈ తలంబ్రాల సాక్షిగా.. పసుపూబియ్యంలా కలిసుందాం ..@శర్మ

\15.9.13\

14, సెప్టెంబర్ 2013, శనివారం

అంతా ప్రేమమయం

ప్రణయం నుంచీ పరిణయందాకా
అంతా ప్రేమమయం ..@శర్మ

\14.9.13\

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఎంత ఘాటు ప్రేమయో

అంతెర్రగా పండిందంటే నామీద నీకు అంత ప్రేమన్నమాట ..@శర్మ

\13.9.13\

12, సెప్టెంబర్ 2013, గురువారం

ఏమి ఆ భాగ్యము?

ఆ ముంగురులలా ఎగిరిపడుతున్నాయి..నీ నుదురును తాకాయన్న ఆనందమా ..@శర్మ

\12.9.13\

11, సెప్టెంబర్ 2013, బుధవారం

నా కలలరాణి

నా కలలరాణివీ..నా కళ్యాణి(ణ) రాగానివీ నీవే ..@శర్మ

\11.9.13\

9, సెప్టెంబర్ 2013, సోమవారం

విఘ్నాలు తొలగించయ్యా

శర్మ సీహెచ్., ||
విఘ్నాలు తొలగించయ్యా||

అటు విభజనవాదం
ఇటు సమైక్యవాదం
తెలుగునేల ముక్కలవుతున్నవైనం

తిరగని ఆర్టీసీ బస్సు చక్రం
చదువులు, కొలువులకు విరామం
దివాళాతీసింది వ్యాపారం

పనిచేయని అధికారగణం
పడకేసిన ప్రభుత్వం
తరచిచూస్తే ప్రగతి శూన్యం

ఎన్జీవోలకు అందని జీతం
ఒడుదొడుకుల జీవితం
అయినా చేస్తాం వినాయకవ్రతం

మరయితే నీకు సమ్మతం
తీర్చవయ్యా అందరి అభిమతం
అప్పుడే రాష్ట్రమంతా ప్రశాంతం

\9-9-13\

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

సిగ్గు మొగ్గ

సిగ్గు మొగ్గలైనట్లుంది.. కల్యాణఘడియలొచ్చాయనా! ..@శర్మ

\8.9.13\

7, సెప్టెంబర్ 2013, శనివారం

6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

బుంగమూతి

నాకెంతో ప్రీతి.. నువ్వు పెట్టే
బుంగమూతి ..@శర్మ

\6.9.13\

4, సెప్టెంబర్ 2013, బుధవారం

3, సెప్టెంబర్ 2013, మంగళవారం

2, సెప్టెంబర్ 2013, సోమవారం

అల్లరి మల్లెలు

నే తెచ్చిన మల్లెలు అల్లరి చేస్తున్నాయి.. నీ సిగలో తురమమని ..@శర్మ

\2.9.13\

1, సెప్టెంబర్ 2013, ఆదివారం

love heart

నా గుండె గుప్పెడంత.. నీపై ప్రేమ గంపెడంత ..@శర్మ

\1.9.13\