ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు మాండోలిన్ శ్రీనివాస్ (45) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాండోలిన్ శ్రీనివాస్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు.
ఆయన 1969 ఫిబ్రవరి 28న జన్మించారు. ఆయన పూర్తిపేరు ఉప్పలపు శ్రీనివాస్ కాగా మాండోలిన్ శ్రీనివాస్ గా ప్రసిద్ధి చెందారు. కళారంగంలో సేవలకు గానూ ఆయన రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అందుకున్నారు. చాలా ఏళ్ల క్రితమే మాండోలిన్ శ్రీనివాస్ కుటుంబం చెన్నైలో స్థిరపడింది. కాగా ఆయన అంత్రక్రియలు చెన్నైలోనే జరగనున్నట్లు సమాచారం.

చిన్న్న వయస్సు లోనే మాండొలిన్ శ్రీనివాస్ మరణం చాలా బాధాకరం.ఆయనకు నా శ్రద్ధాంజలి.
రిప్లయితొలగించండి