9, సెప్టెంబర్ 2013, సోమవారం

విఘ్నాలు తొలగించయ్యా

శర్మ సీహెచ్., ||
విఘ్నాలు తొలగించయ్యా||

అటు విభజనవాదం
ఇటు సమైక్యవాదం
తెలుగునేల ముక్కలవుతున్నవైనం

తిరగని ఆర్టీసీ బస్సు చక్రం
చదువులు, కొలువులకు విరామం
దివాళాతీసింది వ్యాపారం

పనిచేయని అధికారగణం
పడకేసిన ప్రభుత్వం
తరచిచూస్తే ప్రగతి శూన్యం

ఎన్జీవోలకు అందని జీతం
ఒడుదొడుకుల జీవితం
అయినా చేస్తాం వినాయకవ్రతం

మరయితే నీకు సమ్మతం
తీర్చవయ్యా అందరి అభిమతం
అప్పుడే రాష్ట్రమంతా ప్రశాంతం

\9-9-13\

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి