శర్మ సీహెచ్., ||మండే గుండెలు||
అమ్మను చూద్దామన్న ఆశ
నిట్టనిలువునా కాలిపోయింది
వేయికళ్లతో ఎదురుచూసిన నాన్నకు
కడచూపూ దక్కలేదు
తల్లి కాబోతున్న ఇల్లాలిని ముచ్చట తీరకుండానే
ఆ రాకాసి బస్సు మింగేసింది
ఉద్యోగం దొరికిందన్న యువకుడి ఉత్సాహాన్ని
అగ్నికీలలు దహించివేశాయి
కూతురి పెళ్లి చూడకుండానే
ఓ తల్లి కాలిబూడిదయింది
కలిసి జీవనయానం చేస్తున్న ఆ జంటది
మృత్యువులోనూ వీడనిబంధమే
బోలెడంత భవిష్యత్తున్నఓ చిన్నారి..
పెళ్లయి ఏడాది కూడా కాని ఓ అభాగ్యుడు..
ఇలా ఎందరో.. ఎందరెందరో
మృత్యుశకటానికి బలయ్యారు
ఇది ఘోరం.. దారుణం..
దీపాల పండుగవేళ
అయినవారికే కాదు..
మనసున్న ప్రతిఒక్కరికీ
తీరని బాధే మిగిల్చారు..
(బెంగళూరు-హైదరాబాదు బస్సుప్రమాద మృతులందరికీ నా అశ్రునివాళి..)
అమ్మను చూద్దామన్న ఆశ
నిట్టనిలువునా కాలిపోయింది
వేయికళ్లతో ఎదురుచూసిన నాన్నకు
కడచూపూ దక్కలేదు
తల్లి కాబోతున్న ఇల్లాలిని ముచ్చట తీరకుండానే
ఆ రాకాసి బస్సు మింగేసింది
ఉద్యోగం దొరికిందన్న యువకుడి ఉత్సాహాన్ని
అగ్నికీలలు దహించివేశాయి
కూతురి పెళ్లి చూడకుండానే
ఓ తల్లి కాలిబూడిదయింది
కలిసి జీవనయానం చేస్తున్న ఆ జంటది
మృత్యువులోనూ వీడనిబంధమే
బోలెడంత భవిష్యత్తున్నఓ చిన్నారి..
పెళ్లయి ఏడాది కూడా కాని ఓ అభాగ్యుడు..
ఇలా ఎందరో.. ఎందరెందరో
మృత్యుశకటానికి బలయ్యారు
ఇది ఘోరం.. దారుణం..
దీపాల పండుగవేళ
అయినవారికే కాదు..
మనసున్న ప్రతిఒక్కరికీ
తీరని బాధే మిగిల్చారు..
(బెంగళూరు-హైదరాబాదు బస్సుప్రమాద మృతులందరికీ నా అశ్రునివాళి..)