29, నవంబర్ 2013, శుక్రవారం

నిశ్శబ్దం మిగిలింది

నల్లచీర కట్టుకున్న ఆకాశం
తలలాడిస్తున్న తాడిచెట్లు
విరిగిపడుతున్న కొండచరియలు..
మీదపడతాయన్న భయంతో
బక్కప్రాణుల పరుగులు..
పాత భవనం కనపడగానే
లేచొచ్చింది ప్రాణం..
ఇంతలో ఉరుములు.. మెరుపులు
ఆపైన పిడుగులు..
జోరుగా కురుస్తోంది వాన
అందరికీ ఒకే భయం లోలోన..
చివరికి ఆ భయమే నిజమైంది..
పెద్ద శబ్దంతో భవనం కుప్పకూలింది
వారందరిపాలిట మృత్యుకుహరమైంది..
వాన వెలిసింది.. నిశ్శబ్దం మిగిలింది!

\29.11.13\

28, నవంబర్ 2013, గురువారం

27, నవంబర్ 2013, బుధవారం

26, నవంబర్ 2013, మంగళవారం

ఆషాడం పెళ్లికూతురివే

నాకోసం ఎదురుచూసే ప్రతిసారీ
ఆషాడం పెళ్లికూతురివే ..@శర్మ

\26.11.13\

25, నవంబర్ 2013, సోమవారం

నగలమారి

వగలమారివే అనుకున్నా_
నగలమారివి కూడానా ..@శర్మ

\25.11.13\

నేడు ప్రపంచ శాకాహార దినోత్సవం

తినండి తినండి ఉత్సాహంగా..
ఉండండి ఉండండి ఉల్లాసంగా..

(నేడు ప్రపంచ శాకాహార దినోత్సవం)

\25.11.13\

23, నవంబర్ 2013, శనివారం

22, నవంబర్ 2013, శుక్రవారం

21, నవంబర్ 2013, గురువారం

నీ బుగ్గలే బొబ్బట్లు

బొబ్బట్లు తిన్నప్పుడల్లా నీ బుగ్గలే గుర్తొస్తున్నాయి సుమా ..@శర్మ

\21.11.13\

20, నవంబర్ 2013, బుధవారం

ప్రేమమథనం

ప్రేమమథనం చేస్తున్నా _ పెళ్లివాన కురవాలని ..@శర్మ

\20.11.13\

19, నవంబర్ 2013, మంగళవారం

18, నవంబర్ 2013, సోమవారం

సింధూరం

నీ నుదిటికి సింగారం.. నేనద్దిన సింధూరం ..@శర్మ

\18.11.13\

ప్రత్యేక బహుమతి

విశాలాక్షి సాహిత్య మాసపత్రిక నిర్వహించిన పోటీలో నేను రాసిన
అమ్మాయికావాలి కథకు ప్రత్యేక బహుమతి లభించింది. ది. 17-11-13 ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలో జరిగిన విశాలాక్షి వృద్ధాశ్రమ ప్రారంభోత్సవ సభలో హైకోర్టు న్యాయమూర్తి గౌ. జస్టిస్ బి.చంద్రకుమార్, ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ కమిషనర్ జీవన్ లాల్ గాడియా చేతుల మీదుగా అందుకున్నాను.

17, నవంబర్ 2013, ఆదివారం

పున్నమిచంద్రుడి రూపం..

పున్నమిచంద్రుడి రూపం.. చిదిమిపెట్టుకోవచ్చులే దీపం ..@శర్మ

\17.11.13\

16, నవంబర్ 2013, శనివారం

విరహపు విరుపులు


శుభోదయం

నీ విరహపు విరుపుల్ని చూస్తున్నా.. నా తలపుల తలుపుల్లోంచి ..@శర్మ

\16.11.13\

15, నవంబర్ 2013, శుక్రవారం

14, నవంబర్ 2013, గురువారం

నేనేం చిన్నపిల్లనా

నేనేం చిన్నపిల్లనా అన్నా.. నువ్వెప్పుడూ నాకు చిన్నపిల్లవే ..@శర్మ

బాలలదినోత్సవ శుభాకాంక్షలు

\14.11.13\

13, నవంబర్ 2013, బుధవారం

పూతరేకులా ..

ఆ చూపుల్తో నన్ను చుట్టేస్తున్నావుకదే పూతరేకులా ..@శర్మ

\13.11.13\

12, నవంబర్ 2013, మంగళవారం

ఇంకేం కావాలి?

బంతేనా...
ఇంకేం కావాలి?
వీలయితే నాలుగు చామంతులు..
కుదిరితే గుప్పెడుమల్లెలు ..@శర్మ

\12.11.13\

11, నవంబర్ 2013, సోమవారం

భలే గడసరివే ..

ఇంద్రచాపాన్ని అందుకోగలవా అంటే ఏంటో అనుకున్నా.. భలే గడసరివే ..@శర్మ

\11.11.13\

10, నవంబర్ 2013, ఆదివారం

స్వరాభరణం

నీ స్వరాభరణం ముందర ఆ స్వర్ణాభరణం దిగతుడుపే ..@శర్మ

\10.11.13\

8, నవంబర్ 2013, శుక్రవారం

కొత్తపెళ్లికూతురివే

నువ్విలా సిగ్గుపడుతుంటే నిత్యం
కొత్తపెళ్లికూతురివే ..@శర్మ

\8.11.13\

7, నవంబర్ 2013, గురువారం

6, నవంబర్ 2013, బుధవారం

నీ కొప్పునెక్కాలని ..

మల్లే మందారం కొట్టుకుంటున్నాయ్ నీ కొప్పునెక్కాలని ..@శర్మ

\6.11.13\

5, నవంబర్ 2013, మంగళవారం

నా కంటిపాప

నా కంటిపాపవు నీవు.. నీ కంటిరెప్పను నేను ..@శర్మ

\5.11.13\

4, నవంబర్ 2013, సోమవారం

కన్నెమోజులు

కన్నెమోజులుతీర్చే వన్నెకాడిని వస్తున్నానీకోసం ..@శర్మ

\4.11.13\

3, నవంబర్ 2013, ఆదివారం

1, నవంబర్ 2013, శుక్రవారం