29, నవంబర్ 2013, శుక్రవారం

నిశ్శబ్దం మిగిలింది

నల్లచీర కట్టుకున్న ఆకాశం
తలలాడిస్తున్న తాడిచెట్లు
విరిగిపడుతున్న కొండచరియలు..
మీదపడతాయన్న భయంతో
బక్కప్రాణుల పరుగులు..
పాత భవనం కనపడగానే
లేచొచ్చింది ప్రాణం..
ఇంతలో ఉరుములు.. మెరుపులు
ఆపైన పిడుగులు..
జోరుగా కురుస్తోంది వాన
అందరికీ ఒకే భయం లోలోన..
చివరికి ఆ భయమే నిజమైంది..
పెద్ద శబ్దంతో భవనం కుప్పకూలింది
వారందరిపాలిట మృత్యుకుహరమైంది..
వాన వెలిసింది.. నిశ్శబ్దం మిగిలింది!

\29.11.13\

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి