23, ఏప్రిల్ 2016, శనివారం

పానీపట్టు యుద్ధాలు

అడుగంటిన చెరువులు
బావురుమంటున్న బావులు
భోరుమంటున్న బోర్లు
తప్పవులే పానీపట్టు యుద్ధాలు

(ఇప్పటికైనా మేల్కొందాం.. నీటిని పొదుపుగా వాడదాం)

15, ఏప్రిల్ 2016, శుక్రవారం

శ్రీ సీతారాముల కల్యాణోత్సవం

శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా దశరథ, జనక మహారాజు పూర్వీకుల వంశ వైభవాన్ని తెలుసుకుందాం.
🙏రఘువంశ వర్ణన🙏
(దశరథ మహారాజు పూర్వీకులు)
చతుర్ముఖ బ్రహ్మ
మరీచి -->
కశ్యపుడు -->
సూర్యుడు -->
మనువు -->
ఇక్ష్వాకుడు -->
కుక్షి -->
వికుక్షి ->
భానుడు -->
అనరంయుడు -->
పృథుడు -->
త్రిశంకువు -->
దుందుమారుడు ->
మాంధాత -->
సుసంధి కి ఇద్ధరు ధృవసంధి, ప్రసేనజిత్‌
ధృవసంధి->
భరతుడు -->
అశితుడు -->
సగరుడు -->
అసమంజసుడు -->
అంశుమంతుడు -->
దిలీపుడు -->
భగీరతుడు -->
కకుత్సుడు -->
రఘువు -->
ప్రవృద్ధుడు -->
శంఖనుడు -->
సుదర్శనుడు -->
అగ్నివర్ణుడు -->
శీఘ్రకుడు -->
మరువు -->
ప్రశిశృకుడు -->
అంబరీశుడు -->
నహుశుడు -->
యయాతి -->
నాభాగుడు -->
అజుడు -->
దశరథుడు -->
రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుడు.
🙏జనక వంశ వర్ణన🙏
(జనక మహారాజు పూర్వీకులు)
నిమి చక్రవర్తి -->
మిథి -->
ఉదావసువు -->
నందివర్దనుడు -->
సుకేతువు -->
దేవరాతుడు -->
బృహధ్రతుడు కి ఇద్ధరు శూరుడు, మహావీరుడు.
మహావీరుడు -->
సుదృతి -->
దృష్టకేతువు -->
హర్యశృవుడు -->
మరుడు -->
ప్రతింధకుడు -->
కీర్తిరతుడు -->
దేవమీదుడు -->
విభుదుడు -->
మహీద్రకుడు -->
కీర్తిరాతుడు -->
మహారోముడు -->
స్వర్ణరోముడు -->
హ్రస్వరోముడు కి ఇద్దరు. జనకుడు, కుశద్వజుడు.
జనకుడు --> సీత, ఊర్మిళ
కుశద్వజుడు --> మాంఢవి, శృతకీర్తి
శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.
👏శ్రీరామ ప్రవర:-
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...
అజ మహారాజ వర్మణః పౌత్రాయ...
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.
👏సీతాదేవి ప్రవర:-
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...
జనక మహారాజ వర్మణః పుత్రీం...
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...

14, ఏప్రిల్ 2016, గురువారం

ఇదీ సంగతి..

ట్రైన్ ఢీకొని 99 మంది చనిపోయారు..అదృష్టం కొద్దీ ఒకడు బతికాడు..
వాడిని ఓ టీవీ ప్రతినిధి ఇంటర్వ్యూ చేస్తున్నాడు
రిపోర్టర్ : చెప్పండి సర్ ఈ దుర్ఘటన ఎలా జరిగింది?
ఒకడు   : రైల్వే అధికారుల నిర్లక్ష్యం... ఒక తప్పుడు ప్రకటన వల్ల ఇదంతా జరిగింది
రిపోర్టర్ : ఎలా తప్పుడు ప్రకటన సర్
ఒకడు  : ఇంకొద్దీ సేపట్లో ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాబోతుంది అని ప్రకటన చేశారు సర్...
           దానితో అందరూ భయపడి పట్టాల మీదకి  వెళ్ళిపోయారు.. కాని వాళ్ళ దురదృష్టం ఏంటంటే
            ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాలేదు పట్టాల మీదకి వచ్చింది.
రిపోర్టర్ : అయితే మీరు తెలివిగా  తప్పించుకున్నారుగా సర్..
ఒకడు  : తొక్కేమ్ కాదు నాపాటికి నేను ఆత్మహత్య చేసుకుందామని పట్టాలపై
            పడుకున్నా.... కానీ ప్రకటన విన్నాక వెళ్లి ప్లాట్ఫామ్ పై పడుకున్నా...
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++