31, మే 2013, శుక్రవారం

సూపర్ స్టార్

తెరంగేట్రం చేసినారు
తేనెమనసులతో కృష్ణ..
అల్లూరిసీతారామరాజుతో
చాటినారు తనలోని కళాతృష్ణ

సింహాసనం సినిమాతో
దర్శకుడిగా మారెన్..
సాహసమే నా ఊపిరనే
సూపర్ స్టారే నెంబర్ వన్

(నటశేఖరుడికి జన్మదిన శుభాకాంక్షలు)

\31-5-13\

29, మే 2013, బుధవారం

క్రూరగాయలు

కూరలు కోరలు చాచాయి
క్రూరంగా చూస్తున్నాయి
సగటు మనిషి జేబుల్ని
గాయాలు చేస్తున్నాయి
టమాట కొందామంటే
నోట మాట రావడం లేదు
పంటికింద పడకుండానే
పచ్చిమిర్చి మంటపుడుతోంది
కొని కోయకుండానే
ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది
అల్లం ధర చూస్తుంటే
అల్లంత దూరంలో ఉంది
వావ్.. క్యారెట్.. క్యాప్సికం
క్యా రేటు గురూ..
బీన్సు..బెండాదొండా
ధరలు వింటే గుండెదడ
చుక్కలు చూపిస్తున్నాయి
మార్కెట్లో కూరగాయలు
ఇక ఊరగాయలే దిక్కు
\29-5-13\

28, మే 2013, మంగళవారం

నటరత్నం

సినీ వినీలాకశాన
ధ్రువతార నందమూరి..
రాముడైనా..కృష్ణుడైనా
ఆయనే వేయాలి మరి

ఢిల్లీలోన చాటినారు
తెలుగువాడి ఘనత..
రాజకీయ రంగాన
రాసినారు ఘనచరిత

(నేడు ఎన్టీఆర్ జయంతి)

\28-5-13\


27, మే 2013, సోమవారం

శుభాకాంక్షలు

ఐపీఎల్ టోర్నమెంటు
ఇంతటితో సమాప్తం..
క్రికెట్ పిచ్చితో ఊగెను
భారతదేశం సమస్తం

విజయపతాకను ఎగరేసిరి
ముంబయ్ ఇండియన్స్..
తలవంచక తప్పలేదు
చెన్నై సూపర్ కింగ్స్

\27-5-13\

26, మే 2013, ఆదివారం

నా కళ్లు తడారడంలేదు

అవును.. నా రెండు కళ్లూ
రెండు కన్నీటి కొలనులు
ఇప్పటికీ తడారడంలేదు..
నాన్నగారు గుడ్లురిమి చూసినప్పుడల్లా
గుడ్లల్లో నీరు కక్కుకునేవాడిని..
ఇప్పుడలా చూసేందుకు ఆయన లేరు
అయినా నాన్న గుర్తొచ్చినప్పుడల్లా
కళ్లు కన్నీటిజలపాతాలవుతున్నాయి..
అవును.. నా కళ్లు తడారడంలేదు


\26-5-13\

23, మే 2013, గురువారం

శర్మాస్ 3డీలు



(1)
కోకోకోలా
పెప్సీకోలా
తాగేస్తేపోలా
(2)
కరెంటుబిల్లు
టెలిఫోనుబిల్లు
గుండె గుభిల్లు
(3)
ఆరాటం
పోరాటం
జీవితపాఠం

\23-5-13\

21, మే 2013, మంగళవారం

నారీభేరి మాసపత్రిక 2013 ఉగాది కథల పోటీ ఫలితాలు

అనంతపురం నుంచి వెలువడే నారీభేరి మాసపత్రిక నిర్వహించిన ఉగాది కథల పోటీలో నేను రాసిన అలకపాన్పు కథకు రెండో బహుమతి లభించింది..
\21-5-13\

20, మే 2013, సోమవారం

శర్మాస్ 3డీలు


(1)
అమ్మమాట
నాన్నబాట
కట్టని కోట
(2)
అవినీతి
బంధుప్రీతి
లోకరీతి
(3)
పేరుకు జూనియర్
నటనలో సీనియర్
ఆ దమ్ము ఎన్టీఆర్

\20-5-13\

18, మే 2013, శనివారం

అభినందనలు


పదో తరగతి ఫలితాలు
విడుదలైన వేళ..
పిల్లలూ తల్లిదండ్రుల
ఆనందాల హేల

మంచి గ్రేడులు సాధించి
సృష్టించారు కలకలం..
పన్నెండేళ్ళు పడిన శ్రమకు
దక్కెనులే ప్రతిఫలం

(టెన్త్ పాసయిన చిన్నారులకు అభినందనలు)

\18-5-13\

17, మే 2013, శుక్రవారం

రాయల్ మోసం


ఐపీఎల్ క్రికెట్టులో
బెట్టింగుల గోల..
`రాయల్` గా రగిలించిరి
అవినీతి జ్వాల


శ్రీశాంతుడు చేసినాడు
ఫిక్సింగుల రచ్చ..
భారత క్రీడావనిపై ఇది
చెరిగిపోని మచ్చ


(ఐపీఎల్ మ్యాచుల్లో క్రికెటర్లు శ్రీశాంత్, చవాన్, చండీలా బుకీలతో ఫిక్సింగై అడ్డంగా బుక్కయ్యారు)

\17-5-13\

16, మే 2013, గురువారం

`మహా`నష్టం


మహాసేన్ తుపానుతో
మామిడితోటలకు నష్టం..
అయ్యో పాపం రైతన్నకు
వచ్చెనెంతో కష్టం


కాపు బాగా వచ్చిందని
పెట్టుకుంటే ఆశలు..
ప్రకృతమ్మ ప్రకోపించి
చేసినాది అడియాసలు


\16-5-13\

15, మే 2013, బుధవారం

గోవిషాదం


అప్పన్న సన్నిధిలో
మలమలా ఎండలు..
గిలగిలా కొట్టుకుంటూ
చస్తున్నాయ్ దూడలు

నోరులేని జీవాలపై
ఎందుకింత నిర్లక్ష్యం..
పొంచిఉన్న అరిష్టానికి
ఈ గోహత్యలే సాక్ష్యం

(సింహాచలం గోశాలలో గత పక్షం రోజుల్లో 120 ఆవులు మృత్యువాత పడ్డాయి)

\15-5-13\

14, మే 2013, మంగళవారం

శర్మాస్ 3డీలు



(1)
మల్లెపువ్వులు
మామిడి ఫలాలు
వేసవి నేస్తాలు
(2)
వయసు ప్రీతి
సొగసు భీతి
మనసు కోతి
(3)
ఆటలతో ఆహ్లాదం
సినిమాలతో వినోదం
మితిమీరితే ప్రమాదం

\14-5-13\

13, మే 2013, సోమవారం

మాయాబజారు


ఐబీఎన్ పోలింగులో
మాయాబజారు ఫస్టు..
పాత చిత్రరాజాల్లో
ఇదేనండి ది బెస్టు

శతవసంతాల పండుగలో
మన సినిమాకు వీరతాడు..
విజయావారి చిత్రాలను
మరచిపోడు తెలుగోడు

\13-5-13\

12, మే 2013, ఆదివారం


అమ్మఒడి


అమ్మ


అమ్మ అనే పిలుపులోఉన్నదెంతో కమ్మదనం..పిల్లలపై ఆమె ప్రేమతరగనంత మూలధనం


దేశానికి అధిపతయినాతల్లిచాటు బిడ్డడే..వయసు ఎంత మీదపడినాఆమెకెపుడూ పిల్లడే


(అమ్మలందరికీ శుభాకాంక్షలతో)

  \12-5-13\

11, మే 2013, శనివారం

తెలంగాణం


జోరుగా సాగుతోంది
టీడీపీలోతెలంగాణం..
కడియంవారు వదిలినారు
రాజీనామా బాణం

తెలంగాణపై వైఖరేంటో
చెప్పకుంటే చంద్రబాబు..
జనమే పేలుస్తారు..
ఎన్నికల్లో ఓటుబాంబు

\11-5-13\

9, మే 2013, గురువారం

విజయోస్తు


అమ్మాయిలు..అబ్బాయిలు
ఎంసెట్టుకు సిద్ధం..
ఆచితూచి ప్రశ్నలతో
చేయండిక యుద్ధం

అడియాసలు చేయకండి
అమ్మానాన్నల ఆశలు..
మిత్రులతో పోటీపడి
కొట్టండి గట్టి ర్యాంకులు

(మే 10 ఎంసెట్ రాసేవారందరికీ విజయోస్తు)

\9-5-13\

8, మే 2013, బుధవారం

ఎన్ని`కలకలం`


కర్ణాటక కదనంలో
వాడిపోయె కమలం..
కాంగిరేసు శిబిరంలో
కనిపించెను కోలాహలం
రెండుపిల్లుల తగాదాలో
లాభపడినట్టు మర్కటం..
రెండుపార్టీలు చీల్చిన ఓట్లతో
హస్తానికి దక్కనుంది పీఠం


\8-5-13\

7, మే 2013, మంగళవారం

యుగపురుషుడు



పార్లమెంటులో పెడుతుంటిరి
అన్నగారి విగ్రహం..
ఆహ్వానం అందలేదని
చంద్రబాబు ఆగ్రహం

జాగయినా దక్కెనులే
తెలుగువారికి అదృష్టం..
ఎన్టీఆర్ యుగపురుషుడని
మరోసారి సుస్పష్టం

\7-5-13\

6, మే 2013, సోమవారం

అల్లుడి గిల్లుడు


మన్మోహనుడి సర్కారులోమాయమవుతున్నాయ్ స్కీములు..దిన దినమూ పెరుగుతున్నాయిఎడాపెడా స్కాములు..


అవినీతికి గేట్లు తెరిచెబన్సల్ గారి అల్లుడు..రాజీనామా జపంతోప్రతిపక్షాల గిల్లుడు..


\6-5-13\

5, మే 2013, ఆదివారం

హ..హ్హ..హ్హా


చిన్నారుల చిరునవ్వులు

పడుచువాళ్ళ చిలిపినవ్వులు

ఆలుమగల వలపునవ్వులు

బామ్మాతాతల బోసినవ్వులు

నవ్వేజనా సుఖినోభవంతు..

(నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం)


\5-5-13\

4, మే 2013, శనివారం

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు...



నేడు (4-5-13) ప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగరాజు జయంతి..


అలాగే ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటాచలం వర్ధంతి...

2, మే 2013, గురువారం

శర్మాస్ 3డీలు


(1)

ఊరిచివర బడి

చెరువుపక్కన గుడి

అవక్కడే ఏళ్ళతరబడి

(2)

ప్రాయం పదహారు

పరువం యమజోరు

జీవితం హుషారు

(3)

అతడో కవి

పేరు రవి

రాస్తాడు అవీఇవీ


\2-5-13\

1, మే 2013, బుధవారం

లాల్ సలాం


శర్మ సీహెచ్.,

కండల్ని కరిగించి 
బండల్ని పిండిచేసి
బతుకుబండి లాగే
ఓ కార్మికుడా
నీకు లాల్ సలాం..


\1-5-13\