25, జులై 2013, గురువారం
ఆమే నా సైన్యం
అలారం మోగీ మొగ్గానే
అలవోకగా నిద్రలేస్తుంది
అల్లారుముద్దుగా పిల్లల్ని సాకుతూ..
అలాగే నన్నూ అమ్మనీ చూసుకుంటూ
అలా ఇంటిపనులన్నీ చక్కబెడుతుంది..
అలకనేది ఎరుగదు..
అలసటనూ పట్టించుకోదు..
అలాంటి ఆలి దొరకడం నా అదృష్టం..
\25-7-13\
18, జులై 2013, గురువారం
ఉపసంహ`రణం`
పంచాయతీలకు ముగిసెనండీ
నామినేషన్ల ముచ్చట..
బరిలోన ఉన్నవారికి
అధికారం పిచ్చట
కాలరెగరేస్తుంటిరి
తిరుగుబాటు నాయకులు..
తాయిలాలు అందిస్తే
తీరుతాయి అలకలు
\18-7-13\
17, జులై 2013, బుధవారం
ఇదేంసెట్
ఇంజినీరింగ్ వ్యాపారంలో
విద్యార్థులు సమిధలు..
కోర్ట్లులూ కేసులంటూ
పెడుతున్నారు బాధలు
ప్రభుత్వానికి పట్టదా
కౌన్సెలింగ్ నోటిఫికేషన్..
కాలయాపన అవుతోందని
తల్లిదండ్రుల పరేషాన్
\17-7-13\
తంతి కథ కంచికి
సంతోషాలు..విషాదాలు
మోసుకొచ్చి అలసిన టెలిగ్రామ్..
విశ్రాంతినిస్తూ సర్కారు
పలికెనండి రామ్ రామ్
సాంకేతిక విప్లవంలో
పెరిగెనండి ఎస్సెమ్మెస్ వేడి..
ముందొచ్చిన చెవులకన్నా
వెనకొచ్చిన కొమ్ములు వాడి
\17-7-13\
13, జులై 2013, శనివారం
ఎప్పTకిచ్చేను?
సాగదీత స్పెషలిష్ట్లులు
కాంగిరేసు పెద్దలు..
తొందరపడి చేయరట
రాష్ట్రాన్ని బద్దలు
ఏళ్లకేళ్లు గడిచినా
కానరాదు పురోగతి..
దేనికైనా ఉంటుందిలే
వాయిదాల పద్ధతి
\13-7-13\
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)