28, ఆగస్టు 2014, గురువారం

ఔనంటారా.. కాదంటారా?

నా మాట-మీ నోట

రానురాను తెలుగు వాడకం తగ్గిపోవడం బాధాకరం. ఒకప్పుడు వ్యాపారులు తమ దుకాణాల నామఫలకాలను తెలుగులోనే రాయించేవారు. దుకాణం పేరు, వీధి, పేట, ఊరు పేర్లు స్పష్టంగా ఉండేవి. ఊళ్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులొస్తే వారికి కావాల్సిన చిరునామా వెతుక్కోవడం సులభతరమయ్యేది. ఇప్పుడవేమీ లేకుండా కేవలం దుకాణం పేరు మాత్రమే.. అదీను ఆంగ్లంలో రాస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగువారమైన మనం నామఫలకాలపై తెలుగు వెలుగులు విరజిమ్ముదాం. ఔనంటారా.. కాదంటారా?

\28.8.14\

27, ఆగస్టు 2014, బుధవారం

ఇయర్ ఫోన్ పెట్టుకోవచ్చుగా

నా మాట-మీ నోట

మనం ప్రయాణం చేసేటప్పుడో, సినిమా చూస్తున్నప్పుడో పక్కనున్నవారు సెల్ ఫోనులో బిగ్గరగా మాట్లాడితే చిరాకేస్తుంది. మాట్లాడుకోవద్దని చెప్పడం లేదు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా నెమ్మదిగా మాట్లాడవచ్చు. కొందరైతే ఫోను రింగవుతున్నా ఎత్తరు.. కట్ చేయరు. ఇంకొందరైతే మొబైల్ స్పీకర్ ఆన్ చేసి పాటలు వింటుంటారు. ఇదీ ఇబ్బందే.. ఎంచక్కా
ఇయర్ ఫోన్ పెట్టుకోవచ్చుగా.. సరేనా..?

\27.8.14\

26, ఆగస్టు 2014, మంగళవారం

ఇది నిజం.. మీరూ ప్రయత్నించండి...

ఇది నిజం.. మీరూ ప్రయత్నించండి...

దసరా ఉత్సవాలు

నా మాట-మీ నోట

బెజవాడ దుర్గగుడిలో సెప్టెంబరు 25 నుంచి
దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు, వాల్ పోస్టర్లు ముద్రించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సులభంగా దర్శనం అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ముఖ్యంగా దేవస్థానానికి శాశ్వత ఈవోను ప్రభుత్వం వెంటనే నియమిస్తే ఉత్సవ ఏర్పాట్లు సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. మీరేమంటారు?

\26.8.14\

25, ఆగస్టు 2014, సోమవారం

నా మాట-మీ నోట

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు ఏ ఊళ్లో ప్రవచనాలు చెబుతున్నా జనం విరగబడి వస్తున్నారు. నిన్న విజయవాడలోనూ అదే జరిగింది. అంతమందిని ఆధ్యాత్మికత వైపు అడుగులేయించడం నిజంగా ఆయన గొప్పతనమే. అయితే చాగంటివారు చెప్పినవాటిలో కొన్నింటినైనా ఆచరిస్తే హైందవ ధర్మాన్ని కాపాడుకున్నవారమవుతాము. మీరేమంటారు?

\25.8.14\

22, ఆగస్టు 2014, శుక్రవారం

21, ఆగస్టు 2014, గురువారం

20, ఆగస్టు 2014, బుధవారం

19, ఆగస్టు 2014, మంగళవారం

వరుణ్ పుట్టినరోజు

నేడు (19-8-14) నా మేనకోడలి కుమారుడు చి.
వరుణ్  పుట్టినరోజు.. వాడికి మా ఆశీస్సులు..

రెప్పపాటు దృశ్యం

రెప్పపాటు దృశ్యం_రెప్పమాటున భద్రం ..@శర్మ

నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం..
ఛాయాచిత్రకారులందరికీ శుభాకాంక్షలు

\19.8.14\

18, ఆగస్టు 2014, సోమవారం

16, ఆగస్టు 2014, శనివారం

ప్రతిఙ్ఞ

స్వాతంత్ర్య దినోత్సవంనాడు రమ్యభారతి సాహితీ పత్రిక సంపాదకుడు చలపాక ప్రకాష్ విక్టోరియా మ్యూజియం ఆవరణలోని  పింగళి వెంకయ్య విగ్రహం దగ్గర రచయితలు ప్రాంతీయత, మత, కులతత్వాలకు అతీతంగా రచనలు చేస్తామని ప్రతిఙ్ఞ చేసే ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేనూ పాల్గొన్నాను..

చుట్టాన్నైపోనూ

చుట్టాన్నైపోనూ_నువ్వలా చూపుల్తో చుట్టేస్తే ..@శర్మ

\16.8.14\

11, ఆగస్టు 2014, సోమవారం

10, ఆగస్టు 2014, ఆదివారం

9, ఆగస్టు 2014, శనివారం

వెలుగుచుక్క

వెలుగుచుక్క మెరిసింది_సందె పొద్దుల్లో ..@శర్మ

\9.8.14\

8, ఆగస్టు 2014, శుక్రవారం

మన అతిథి ఇక ఆగడు..

ఘట్టమనేని వంశానికి యువరాజు
అమ్మాయిల కలల రాజకుమారుడు
నమ్రత మనసు దోచిన టక్కరిదొంగ
నాన్నలా అతడికీ ఉంది ఖలేజా
నటనలో నేనొక్కడినే అంటూ దూకుడు
నిర్మాతలకు కాసులు కురిపించే బిజినెస్ మాన్
ఒక అర్జున్.. ఒక సైనికుడు.. ఒక పోకిరి
అతడు పుట్టినరోజు బాలచంద్రుడు నేడు
నిజం..
మన అతిథి ఇక ఆగడు..

సూపర్ * మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

లక్ష్మీపూజకి పూలడిగితే

కొమ్మ కొమ్మా తలవంచింది_లక్ష్మీపూజకి పూలడిగితే ..@శర్మ

\8.8.14\

7, ఆగస్టు 2014, గురువారం

ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ణో: పరాంప్రేయసీం
తద్వక్ష:స్థల నిత్య వాసరికాం తతేక్షాంతి సంవర్ధినీం
పద్మాలంకృతపాణి పల్లవ యుగాంపద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం..

వరలక్ష్మికి వందనం..
మీకూ లక్ష్మీకటాక్షం కలగాలని ఆశిస్తూ అందరికీ వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు..


\8.8.14\

రాణీపువ్వు రాజసం

రాణీపువ్వుకెంతటి రాజసం_అందాల జవ్వని జడకెక్కానని ..@శర్మ

\7.8.14\

6, ఆగస్టు 2014, బుధవారం

5, ఆగస్టు 2014, మంగళవారం

4, ఆగస్టు 2014, సోమవారం

నల్ల కలువ

నల్ల కాలువ తెల్లబోయింది_నల్ల కలువలాంటి నిను చూసి ..@శర్మ

\4.8.14\

3, ఆగస్టు 2014, ఆదివారం

2, ఆగస్టు 2014, శనివారం

పింగళి వెంకయ్య జయంతి

మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యగారు కృష్ణా జిల్లావాసి కావడం ఎంతో గర్వకారణం. నేడు ఆ మహానుభావుడి
జయంతి సందర్భంగా ఓసారి మననం చేసుకుందాం..

నేనిక నీ వశం

నీవొక మధుకలశం_నేనిక నీ వశం ..@శర్మ

\2.8.14\

1, ఆగస్టు 2014, శుక్రవారం