28, ఆగస్టు 2014, గురువారం

ఔనంటారా.. కాదంటారా?

నా మాట-మీ నోట

రానురాను తెలుగు వాడకం తగ్గిపోవడం బాధాకరం. ఒకప్పుడు వ్యాపారులు తమ దుకాణాల నామఫలకాలను తెలుగులోనే రాయించేవారు. దుకాణం పేరు, వీధి, పేట, ఊరు పేర్లు స్పష్టంగా ఉండేవి. ఊళ్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులొస్తే వారికి కావాల్సిన చిరునామా వెతుక్కోవడం సులభతరమయ్యేది. ఇప్పుడవేమీ లేకుండా కేవలం దుకాణం పేరు మాత్రమే.. అదీను ఆంగ్లంలో రాస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగువారమైన మనం నామఫలకాలపై తెలుగు వెలుగులు విరజిమ్ముదాం. ఔనంటారా.. కాదంటారా?

\28.8.14\

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి