8, జూన్ 2013, శనివారం

ఆ రోజులే వేరు

వాకిట్లో వాన పడుతుంటే
వడివడిగా పరిగెత్తుకెళ్లి
తడిసి ముద్దయ్యేవాళ్లం
మట్టివాసనల్ని ఆస్వాదిస్తూ
కాగితప్పడవలు చేసి
నీళ్లల్లో వదిలేవాళ్లం
ఇది మా చిన్నప్పటి ముచ్చట..
ఇప్పటి పిల్లకాయలకు
ఆ ఆనందమూలేదు
ఆ అదృష్టమూ లేదు..
అగ్గిపెట్టెల్లాంటి అపార్టుమెంట్ల్లల్లో
తలుపులు బిడాయించుక్కూర్చుంటే
వాన పడినా తెలీదు..
ఊరుమునిగినా తెలీదు..
కార్టూన్ సినిమాల్తో కంప్యూటర్లముందు
కాలక్షేపం చేసే చిన్నారులకు
కాగితప్పడవలు చేయడమూ రాదు
చేయాలనుకున్నా తీరికా ఉండదు..

\8-6-13\

1 కామెంట్‌:

  1. నోస్టాల్జియాకవిత్వం ...కాగితపు పడవలూ లేవు...అలనాటి ఆటలూ లేవు...బాల్యం కుంచించుకుపోతోంది!

    రిప్లయితొలగించండి