25, సెప్టెంబర్ 2014, గురువారం

దసరా ఉత్సవాలకు రాష్ట్ర పండుగ హోదా

నా మాట-మీ నోట

రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద దేవస్థానంగా ప్రసిద్ధిగాంచిన బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఈ ఉత్సవాలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు  ఒత్తిడి తేవాలి. ఫ్రెండ్స్.. మరి మీరేమంటారు?

\25.9.14\

దసరా నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు


24, సెప్టెంబర్ 2014, బుధవారం

పెద్దన్న సరసన భారత్

బెంగళూరు: తొలి ప్రయత్నంలో అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది. అంగారక గ్రహం ఉపరితలానికి 515 కిలో మీటర్ల దూరం, భూమికి 215 కిలోమీటర్ల దూరంలో మామ్ ను విజయవంతంగా ప్రవేశపెట్టడంలో భారత శాస్త్రవేత్తలు విజయం సాధించారు.
మంగళవారం ఉదయం 4.17 నిమిషాలకు అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశించడం జరిగింది.
దాంతో రెడియో సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఓ ప్రత్యేకమైన యాంటెనాను ఏర్పాటు చేశారు. అంగారక గ్రహం వైపు 6.57 నిమిషాలకు మామ్ దూసుకెళ్లడం ప్రారంభించింది. ఆ తర్వాత అంగారక కక్ష్యలోకి వెళ్లడానికి 7.17 నిమిషాలకు ప్రధాన ఇంజన్ పనిచేయడం ప్రారంభించింది. ఈ కీలక ఘట్టంలో 7.12 నిమిషాలకు అంగారక గ్రహంలో గ్రహణం ఏర్పడింది. 7.30 నిమిషాలకు ప్రధాన ఇంజన్ లోని 440 న్యూటన్ లిక్విడ్ అపోజి మోటర్ నిప్పులు గక్కుతూ పనిచేయడం ప్రారంభించింది.
 ఆతర్వాత 24 నిమిషాలకు అంటే 7.54 గంటలకు అంగారక గ్రహంలోకి మామ్ విజయవంతంగా ప్రవేశించింది.  మామ్ ప్రయోగం విజయవంతమమైనట్టు యూఎస్, యూరప్, భారత్, ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసిన ఎర్త్ స్టేషన్లలోని రాడార్స్ కు సిగ్నల్ అందాయి.

\24.9.14\

22, సెప్టెంబర్ 2014, సోమవారం

నీ రాకకోసం

నా కలల వాకిళ్లు తెరిచే ఉంచుతా_నీ రాకకోసం ఎదురుచూస్తూ..

22 SEPT 14

20, సెప్టెంబర్ 2014, శనివారం

పత్రికా స్వేచ్ఛ ఏమైంది?

నా మాట-మీ నోట

తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ప్రసారాలు నిలిచిపోయినా సీఎం కేసీఆర్ మాట్లాడ్డం లేదు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు సాక్షి మీడియాను అనుమతించడం లేదు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు పెదవి విప్పడం లేదు. అసలు మనం ఎక్కడున్నాం?
పత్రికా స్వేచ్ఛ ఏమైంది?
కలాలను అడ్డుకోవడమంటే అరచేత్తో సూర్యుడిని మూసినట్లే.

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ప్రముఖ విద్వాంసుడు మాండోలిన్ శ్రీనివాస్ కన్నుమూత

ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు మాండోలిన్ శ్రీనివాస్ (45) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాండోలిన్ శ్రీనివాస్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు.
ఆయన 1969 ఫిబ్రవరి 28న జన్మించారు. ఆయన పూర్తిపేరు  ఉప్పలపు శ్రీనివాస్ కాగా మాండోలిన్ శ్రీనివాస్ గా ప్రసిద్ధి చెందారు. కళారంగంలో సేవలకు గానూ ఆయన రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అందుకున్నారు. చాలా ఏళ్ల క్రితమే మాండోలిన్ శ్రీనివాస్ కుటుంబం చెన్నైలో స్థిరపడింది. కాగా ఆయన అంత్రక్రియలు చెన్నైలోనే జరగనున్నట్లు సమాచారం.

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

ప్లాట్ ఫారాలపై చెత్త వేస్తే 500 రూపాయల జరిమానా

నా మాట-మీ నోట

బెజవాడ రైల్వే స్టేషన్ను అద్దంలా ఉంచేందుకు రైల్వే అధికారులు నానా తంటాలు పడుతున్నారు. మనం కూడా కాఫీ కప్పులు, ప్లాస్టిక్ సీసాలు, వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా వారికి సహకరిద్దాం. ఇంకో విషయమేమంటే స్టేషన్ లోపల, ప్లాట్ ఫారాలపై చెత్త వేస్తే 500 రూపాయల జరిమానా విధిస్తున్నారు. మరి జాగ్రత్తగా ఉండాల్సిందే..

15, సెప్టెంబర్ 2014, సోమవారం

13, సెప్టెంబర్ 2014, శనివారం

పార్కింగ్ పరేషాన్

నా మాట-మీ నోట

వాహనాల పార్కింగ్ విషయంలో కొందరికి  పౌర స్పృహ లేకుండాపోతోంది. బ్యాంకులు, ఆస్పత్రులు, ఆలయాలు, ఇళ్ల ముందు ఇష్టమొచ్చిన రీతిలో పార్కింగ్ చేసేస్తున్నారు. కనీసం లోపలికి ఎలా వెళ్తారనే ఆలోచన వారికి రాకపోవడం బాధాకరం. ఎవరికీ ఇబ్బంది కలగకుండా పార్కింగ్ చేయడం మన సంస్కారం.. మీరేమంటారు?

\13.9.14\

10, సెప్టెంబర్ 2014, బుధవారం

ర్యాగింగ్ చేస్తే కేసులు

నా మాట-మీ నోట

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఇంజినీరింగ్ కాలేజీలు మొదలయ్యాయి. బీటెక్ ఫస్టియర్ స్టూడెంట్స్ క్లాసులకెళుతున్నారు. వీళ్లెప్పుడొస్తారా. ర్యాగింగ్ ఎలా చేద్దామా అని సీనియర్లూ ఉబలాటపడుతున్నారు. అయితే పిల్లలూ ఒక్కటి గుర్తుంచుకోండి. ఇప్పుడు
ర్యాగింగ్ చేస్తే కేసులు, కఠిన శిక్షలూ వేస్తున్నారు. ర్యాగింగులకు దూరంగా ఉండండి.. బంగారు భవిష్యత్తును పాడుచేసుకోకండి.. తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురాకండి.. మరి మీరేమంటారు?

6, సెప్టెంబర్ 2014, శనివారం

డబ్బెలా డ్రా చేయాలి?

నా మాట-మీ నోట

ఏ సమయంలోనైనా ఏటీఎంల డ్వారా డబ్బు డ్రా చేసుకునే అద్భుత అవకాశాన్ని బ్యాంకులు మనకు కల్పించాయి. కానీ కొన్ని ఏటీఎంలు ఎప్పుడూ పనిచేయవు.. ఉదాహరణకు విజయవాడ సూర్యారావుపేటలో ఉన్న ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం కరెంటు పోతే అస్సలు పనిచేయదు. ఇంకొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంది. కరెంటు లేనప్పుడు
డబ్బెలా డ్రా చేయాలి? మీరే చెప్పండి..

\6.9.14\

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

గురువులందరికీ వందనాలు.

గురువులందరికీ వందనాలు..

జర్నలిజంలో నాకు ఓనమాలు నేర్పిన ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు నండూరి రామ్మోహనరావుగారితో..

\5.9.14\

1, సెప్టెంబర్ 2014, సోమవారం

బాపుగారికి నివాళి

అమ్మాయంటే బాపు బొమ్మలా ఉండాలి
అక్షరం రాస్తే బాపు ఫాంటులో రాయాలి
దీన్ని తెలుగువారందరూ అంగీకరించాలి..

కుంచెతో ఆయన గీసిన సిత్రాలు
కెమెరాతో ఆయన తీసిన చిత్రాలు
అభిమానుల గుండెల్లో ఎప్పటికీ సజీవాలు..

\1.9.14\