24, సెప్టెంబర్ 2014, బుధవారం

పెద్దన్న సరసన భారత్

బెంగళూరు: తొలి ప్రయత్నంలో అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది. అంగారక గ్రహం ఉపరితలానికి 515 కిలో మీటర్ల దూరం, భూమికి 215 కిలోమీటర్ల దూరంలో మామ్ ను విజయవంతంగా ప్రవేశపెట్టడంలో భారత శాస్త్రవేత్తలు విజయం సాధించారు.
మంగళవారం ఉదయం 4.17 నిమిషాలకు అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశించడం జరిగింది.
దాంతో రెడియో సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఓ ప్రత్యేకమైన యాంటెనాను ఏర్పాటు చేశారు. అంగారక గ్రహం వైపు 6.57 నిమిషాలకు మామ్ దూసుకెళ్లడం ప్రారంభించింది. ఆ తర్వాత అంగారక కక్ష్యలోకి వెళ్లడానికి 7.17 నిమిషాలకు ప్రధాన ఇంజన్ పనిచేయడం ప్రారంభించింది. ఈ కీలక ఘట్టంలో 7.12 నిమిషాలకు అంగారక గ్రహంలో గ్రహణం ఏర్పడింది. 7.30 నిమిషాలకు ప్రధాన ఇంజన్ లోని 440 న్యూటన్ లిక్విడ్ అపోజి మోటర్ నిప్పులు గక్కుతూ పనిచేయడం ప్రారంభించింది.
 ఆతర్వాత 24 నిమిషాలకు అంటే 7.54 గంటలకు అంగారక గ్రహంలోకి మామ్ విజయవంతంగా ప్రవేశించింది.  మామ్ ప్రయోగం విజయవంతమమైనట్టు యూఎస్, యూరప్, భారత్, ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసిన ఎర్త్ స్టేషన్లలోని రాడార్స్ కు సిగ్నల్ అందాయి.

\24.9.14\

1 కామెంట్‌: