5, డిసెంబర్ 2013, గురువారం

గురువారం నాది


ఆదివారం..

నాకిష్టంలేని రోజు
అందరికీ సెలవైతే
నాకు ఆఫీసుంటుంది

సోమవారం..

సోమరివారం
కాస్త కష్టపడాల్సిందే
పిల్లల్ని నిద్రలేపడానికి

మంగళవారం..

అమంగళం కాకున్నా
ఏదో ఒకసాకుతో
పనులన్నింటికీ బ్రేకులే

బుధవారం..

త్వరగా గడవాలనుకుంటా
ఎందుకో తెలుసా
మర్నాడు గురువారం కదా

గురువారం..

భలే మంచిరోజు
నాకు వీక్లీఆఫ్
ఎంచక్కా ఇంట్లో గడపొచ్చు

శుక్రవారం..

ఇదీనూ ఇష్టమే
లలితాసహస్రనామాలతో
మా ఇల్లు మార్మోగుతుంది

శనివారం..

విశ్రాంతిలేని పనివారం
నా శ్రీమతి వండే వెరైటీ టిఫిన్లు
ఆఫీసులో వారాంతపు సమీక్షలతో#

\5.12.13\

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి