23, అక్టోబర్ 2014, గురువారం
22, అక్టోబర్ 2014, బుధవారం
దీపావళి అనగా దీపముల వరుస
ఆశ్వయుజ కార్తీకములలో అ త్యంత ప్రధానమైనది దీపము. దీపావళి అనగా దీపముల వరుస. దీపావళి అమావాస్యనాడు గంగ ఎక్కడున్నా మనం స్నానం చేస్తున్న నీటిలోనికి ఆవాహన అవుతుంది. 'తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్! అలక్ష్మీ పరిహారార్ధం తైలాభ్యంగో విధీయతే!! దీపావళి నాడు గంగ నీటిని, లక్ష్మి నూనెను ఆవహిస్తుంది. అందుకే నూనె రాసుకొని స్నానం చేయాలి. ఎందుకంటే లక్ష్మీ స్పర్శవల్ల అలక్ష్మీ పోతుంది. గంగ స్నానం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. ఆరోజు తప్పకుండా దీపముల వరుస వెలిగించి వాటి కాంతిలో అలక్ష్మిని తొలగగొడతారు. అంతరమందు జీవుని యొక్క ఉన్నతినీ, బాహ్యమునందు అలక్ష్మిని పోగొట్టుకొంటున్నాము అని చెప్పడానికి పెద్ద చప్పుళ్ళు చేస్తూ వెలుతురుతో కూడిన వివిధరకములైన బాణా సంచా కాలుస్తాము. బాణసంచా కాల్చడానికి కారణం నరకాసురవధ అని కాదు...'అలక్ష్మీ పరిహారార్ధం'. పితృదేవతలకు మార్గం చూపించడానికి ఇంట్లోకి వెళ్లి కాళ్ళూ చేతులూ కళ్ళూ కడుక్కొని ఆచమనం చేసి లక్ష్మీ పూజ చేస్తారు. తరువాత దీపముల వరుసలు పెడతారు. ఆకాలమందు అమ్మవారు ఉత్తరేణి చెట్టు వ్రేళ్ళయందు ప్రవేశిస్తుంది. ఈరోజు మట్టితో కూడుకున్న ఉత్తరేణి తీసుకొని స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పి తలమీదనుంచి నీళ్ళు పోసుకుంటూ ఆ ఉత్తరేణి చెట్టు యొక్క మట్టి మీద పడేట్లుగా తిప్పుకోవాలి.
20, అక్టోబర్ 2014, సోమవారం
26, సెప్టెంబర్ 2014, శుక్రవారం
25, సెప్టెంబర్ 2014, గురువారం
దసరా ఉత్సవాలకు రాష్ట్ర పండుగ హోదా
నా మాట-మీ నోట
రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద దేవస్థానంగా ప్రసిద్ధిగాంచిన బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఈ ఉత్సవాలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలి. ఫ్రెండ్స్.. మరి మీరేమంటారు?
\25.9.14\

24, సెప్టెంబర్ 2014, బుధవారం
పెద్దన్న సరసన భారత్
బెంగళూరు: తొలి ప్రయత్నంలో అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది. అంగారక గ్రహం ఉపరితలానికి 515 కిలో మీటర్ల దూరం, భూమికి 215 కిలోమీటర్ల దూరంలో మామ్ ను విజయవంతంగా ప్రవేశపెట్టడంలో భారత శాస్త్రవేత్తలు విజయం సాధించారు.
మంగళవారం ఉదయం 4.17 నిమిషాలకు అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశించడం జరిగింది.
దాంతో రెడియో సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఓ ప్రత్యేకమైన యాంటెనాను ఏర్పాటు చేశారు. అంగారక గ్రహం వైపు 6.57 నిమిషాలకు మామ్ దూసుకెళ్లడం ప్రారంభించింది. ఆ తర్వాత అంగారక కక్ష్యలోకి వెళ్లడానికి 7.17 నిమిషాలకు ప్రధాన ఇంజన్ పనిచేయడం ప్రారంభించింది. ఈ కీలక ఘట్టంలో 7.12 నిమిషాలకు అంగారక గ్రహంలో గ్రహణం ఏర్పడింది. 7.30 నిమిషాలకు ప్రధాన ఇంజన్ లోని 440 న్యూటన్ లిక్విడ్ అపోజి మోటర్ నిప్పులు గక్కుతూ పనిచేయడం ప్రారంభించింది.
ఆతర్వాత 24 నిమిషాలకు అంటే 7.54 గంటలకు అంగారక గ్రహంలోకి మామ్ విజయవంతంగా ప్రవేశించింది. మామ్ ప్రయోగం విజయవంతమమైనట్టు యూఎస్, యూరప్, భారత్, ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసిన ఎర్త్ స్టేషన్లలోని రాడార్స్ కు సిగ్నల్ అందాయి.
\24.9.14\

22, సెప్టెంబర్ 2014, సోమవారం
20, సెప్టెంబర్ 2014, శనివారం
పత్రికా స్వేచ్ఛ ఏమైంది?
నా మాట-మీ నోట
తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ప్రసారాలు నిలిచిపోయినా సీఎం కేసీఆర్ మాట్లాడ్డం లేదు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు సాక్షి మీడియాను అనుమతించడం లేదు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు పెదవి విప్పడం లేదు. అసలు మనం ఎక్కడున్నాం?
పత్రికా స్వేచ్ఛ ఏమైంది?
కలాలను అడ్డుకోవడమంటే అరచేత్తో సూర్యుడిని మూసినట్లే.

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం
ప్రముఖ విద్వాంసుడు మాండోలిన్ శ్రీనివాస్ కన్నుమూత
ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు మాండోలిన్ శ్రీనివాస్ (45) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాండోలిన్ శ్రీనివాస్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు.
ఆయన 1969 ఫిబ్రవరి 28న జన్మించారు. ఆయన పూర్తిపేరు ఉప్పలపు శ్రీనివాస్ కాగా మాండోలిన్ శ్రీనివాస్ గా ప్రసిద్ధి చెందారు. కళారంగంలో సేవలకు గానూ ఆయన రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అందుకున్నారు. చాలా ఏళ్ల క్రితమే మాండోలిన్ శ్రీనివాస్ కుటుంబం చెన్నైలో స్థిరపడింది. కాగా ఆయన అంత్రక్రియలు చెన్నైలోనే జరగనున్నట్లు సమాచారం.

16, సెప్టెంబర్ 2014, మంగళవారం
ప్లాట్ ఫారాలపై చెత్త వేస్తే 500 రూపాయల జరిమానా
నా మాట-మీ నోట
బెజవాడ రైల్వే స్టేషన్ను అద్దంలా ఉంచేందుకు రైల్వే అధికారులు నానా తంటాలు పడుతున్నారు. మనం కూడా కాఫీ కప్పులు, ప్లాస్టిక్ సీసాలు, వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా వారికి సహకరిద్దాం. ఇంకో విషయమేమంటే స్టేషన్ లోపల, ప్లాట్ ఫారాలపై చెత్త వేస్తే 500 రూపాయల జరిమానా విధిస్తున్నారు. మరి జాగ్రత్తగా ఉండాల్సిందే..

15, సెప్టెంబర్ 2014, సోమవారం
14, సెప్టెంబర్ 2014, ఆదివారం
13, సెప్టెంబర్ 2014, శనివారం
10, సెప్టెంబర్ 2014, బుధవారం
ర్యాగింగ్ చేస్తే కేసులు
నా మాట-మీ నోట
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఇంజినీరింగ్ కాలేజీలు మొదలయ్యాయి. బీటెక్ ఫస్టియర్ స్టూడెంట్స్ క్లాసులకెళుతున్నారు. వీళ్లెప్పుడొస్తారా. ర్యాగింగ్ ఎలా చేద్దామా అని సీనియర్లూ ఉబలాటపడుతున్నారు. అయితే పిల్లలూ ఒక్కటి గుర్తుంచుకోండి. ఇప్పుడు
ర్యాగింగ్ చేస్తే కేసులు, కఠిన శిక్షలూ వేస్తున్నారు. ర్యాగింగులకు దూరంగా ఉండండి.. బంగారు భవిష్యత్తును పాడుచేసుకోకండి.. తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురాకండి.. మరి మీరేమంటారు?

6, సెప్టెంబర్ 2014, శనివారం
డబ్బెలా డ్రా చేయాలి?
నా మాట-మీ నోట
ఏ సమయంలోనైనా ఏటీఎంల డ్వారా డబ్బు డ్రా చేసుకునే అద్భుత అవకాశాన్ని బ్యాంకులు మనకు కల్పించాయి. కానీ కొన్ని ఏటీఎంలు ఎప్పుడూ పనిచేయవు.. ఉదాహరణకు విజయవాడ సూర్యారావుపేటలో ఉన్న ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం కరెంటు పోతే అస్సలు పనిచేయదు. ఇంకొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంది. కరెంటు లేనప్పుడు
డబ్బెలా డ్రా చేయాలి? మీరే చెప్పండి..
\6.9.14\

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం
1, సెప్టెంబర్ 2014, సోమవారం
29, ఆగస్టు 2014, శుక్రవారం
28, ఆగస్టు 2014, గురువారం
ఔనంటారా.. కాదంటారా?
నా మాట-మీ నోట
రానురాను తెలుగు వాడకం తగ్గిపోవడం బాధాకరం. ఒకప్పుడు వ్యాపారులు తమ దుకాణాల నామఫలకాలను తెలుగులోనే రాయించేవారు. దుకాణం పేరు, వీధి, పేట, ఊరు పేర్లు స్పష్టంగా ఉండేవి. ఊళ్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులొస్తే వారికి కావాల్సిన చిరునామా వెతుక్కోవడం సులభతరమయ్యేది. ఇప్పుడవేమీ లేకుండా కేవలం దుకాణం పేరు మాత్రమే.. అదీను ఆంగ్లంలో రాస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగువారమైన మనం నామఫలకాలపై తెలుగు వెలుగులు విరజిమ్ముదాం. ఔనంటారా.. కాదంటారా?
\28.8.14\

27, ఆగస్టు 2014, బుధవారం
ఇయర్ ఫోన్ పెట్టుకోవచ్చుగా
నా మాట-మీ నోట
మనం ప్రయాణం చేసేటప్పుడో, సినిమా చూస్తున్నప్పుడో పక్కనున్నవారు సెల్ ఫోనులో బిగ్గరగా మాట్లాడితే చిరాకేస్తుంది. మాట్లాడుకోవద్దని చెప్పడం లేదు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా నెమ్మదిగా మాట్లాడవచ్చు. కొందరైతే ఫోను రింగవుతున్నా ఎత్తరు.. కట్ చేయరు. ఇంకొందరైతే మొబైల్ స్పీకర్ ఆన్ చేసి పాటలు వింటుంటారు. ఇదీ ఇబ్బందే.. ఎంచక్కా
ఇయర్ ఫోన్ పెట్టుకోవచ్చుగా.. సరేనా..?
\27.8.14\

26, ఆగస్టు 2014, మంగళవారం
దసరా ఉత్సవాలు
నా మాట-మీ నోట
బెజవాడ దుర్గగుడిలో సెప్టెంబరు 25 నుంచి
దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు, వాల్ పోస్టర్లు ముద్రించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సులభంగా దర్శనం అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ముఖ్యంగా దేవస్థానానికి శాశ్వత ఈవోను ప్రభుత్వం వెంటనే నియమిస్తే ఉత్సవ ఏర్పాట్లు సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. మీరేమంటారు?
\26.8.14\

25, ఆగస్టు 2014, సోమవారం
23, ఆగస్టు 2014, శనివారం
22, ఆగస్టు 2014, శుక్రవారం
21, ఆగస్టు 2014, గురువారం
20, ఆగస్టు 2014, బుధవారం
19, ఆగస్టు 2014, మంగళవారం
18, ఆగస్టు 2014, సోమవారం
16, ఆగస్టు 2014, శనివారం
15, ఆగస్టు 2014, శుక్రవారం
11, ఆగస్టు 2014, సోమవారం
10, ఆగస్టు 2014, ఆదివారం
9, ఆగస్టు 2014, శనివారం
8, ఆగస్టు 2014, శుక్రవారం
మన అతిథి ఇక ఆగడు..
ఘట్టమనేని వంశానికి యువరాజు
అమ్మాయిల కలల రాజకుమారుడు
నమ్రత మనసు దోచిన టక్కరిదొంగ
నాన్నలా అతడికీ ఉంది ఖలేజా
నటనలో నేనొక్కడినే అంటూ దూకుడు
నిర్మాతలకు కాసులు కురిపించే బిజినెస్ మాన్
ఒక అర్జున్.. ఒక సైనికుడు.. ఒక పోకిరి
అతడు పుట్టినరోజు బాలచంద్రుడు నేడు
నిజం..
మన అతిథి ఇక ఆగడు..
సూపర్ * మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

7, ఆగస్టు 2014, గురువారం
6, ఆగస్టు 2014, బుధవారం
5, ఆగస్టు 2014, మంగళవారం
4, ఆగస్టు 2014, సోమవారం
3, ఆగస్టు 2014, ఆదివారం
2, ఆగస్టు 2014, శనివారం
1, ఆగస్టు 2014, శుక్రవారం
31, జులై 2014, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)