నెటిజన్లూ జర జాగ్రత్త! అని భారత సైబర్ సెక్యూరిటీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్‌నెట్ ప్రపంచంలో ఓ ప్రమాదకర వైరస్ విహరిస్తోంది. అంతూ పొంతూ లేకుండా విస్తరిస్తూ వినియోగదారుల యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను తస్కరిస్తోంది. యాంటీ వైరస్‌లకూ చిక్కకుండా తన పని తాను చేసుకుపోతోంది. దీన్ని 'విన్32/రామ్‌నిట్' రకానికి చెందిన మాల్‌వేర్‌గా భావిస్తున్నారు. ఈ వైరస్ ప్రవేశించగానే కంప్యూటర్‌లోని అన్ని రకాల ఫైళ్లలో మార్పులు చేసేసి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటోందని సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం-ఇండియా(సెర్ట్-ఇండ్) అధికారులు వివరించారు. ప్రతి అప్లికేషన్ ఈ వైరస్ నియంత్రణలోకి వెళుతుందని, వాటిలోని సమాచారాన్ని దాని కంట్రోల్ సర్వర్లకు చేరవేస్తుందని తెలిపారు. ఈ వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గుర్తు తెలియని ఫైళ్లను, వెబ్ లింకులను ఓపెన్ చేయొద్దని, ఈమెయిళ్లలో అటాచ్‌మెంట్లను కూడా తెరవకూడదని సూచించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి