8, ఏప్రిల్ 2013, సోమవారం


పండగ కళతప్పుతోంది!


పండగపూట తోరణాలు కడదామంటే
నగరంలో మామిడిచెట్టు కనపడడంలేదెక్కడా..
ఉగాదిపచ్చట్లోకి వేప్పూత కావాలంటే
రైతుబజారుకెళ్ళి కొనుక్కోవడమొక్కటే ముచ్చట..
హోలీనాడు సరదాగా చల్లుకోవాల్సిన రంగులు
రసాయనాలతో రంగరించి చెరిపేస్తున్నారు హద్దులు..
మట్టివినాయకుడ్ని దూరంపెడుతున్నారు మనోళ్ళు
పర్యావరణాన్ని పట్టించుకోవడంలేదు కుర్రాళ్ళు..
అంతరించిపోతున్నాయి దసరా సరదాలు
దసరామమూళ్ళకు మాత్రం వేయలేకపోతున్నారు పరదాలు..
అట్లతద్దెలను అటకెక్కిస్తున్నారు
ఉట్టికొట్టడాన్ని ఉసూరుమనిపిస్తున్నారు..
దీపావళికి పేలేవి టపాసులు కావండోయ్
ఆ టపాసుల ధరలు మోతమోగుతున్నాయ్..
కనుమరుగవుతున్నాయి కొత్త సంవత్సర గ్రీటింగులు
పెచ్చరిల్లిపోతున్నాయి మొబైల్ ఫోన్ల ఆంగ్ల సందేశాలు..
సంక్రాంతి పండుగలో మాయమైంది క్రాంతి
ఇదొక్కటే కాదు..మున్ముందు ప్రతి పండగా ఓ భ్రాంతి..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి